ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
అర్జున్ సమాచారం: ఉద్యోగ విరమణ అంటే పని జీవితానికి ముగింపు. కానీ చురుకైన జీవనానికి మాత్రం ముగింపు కాకూడదు. వయసు పెరిగే కొద్దీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతోపాటు మానసికంగా చురుకుగా, సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండటం కూడా ఎంతో ముఖ్యం. కార్యాలయం నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ఉత్పాదకతకు దూరం కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికంగా పదవీ విరమణకు సిద్ధమవ్వడంతోపాటు, ఆ తర్వాతి జీవితాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడిపేందుకు కూడా ముందుగానే ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆధునిక వైద్యం, టీకాలు, యాంటీబయాటిక్స్...