ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: తపస్ ధర్నాకు బీజేపీ మద్దతు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తపస్ (టిపియుఎస్) ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ధర్నాకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, కాలపరిమితితో...