ఉప్పొంగిన కాగ్నానది వికారాబాద్
వికారాబాద్,అర్జున్ సమాచారం: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు తాండూరు ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చాయి. ఎండిపోయి వెలవెలబోయిన కాగ్నానది ఇప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహం రైతుల్లో కొత్త ఆశలను నింపగా... తాండూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనాన్ని అందించింది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. . ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలతో కాగ్నానది పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఇసుక మేటలతో కనిపించిన నది... ఇప్పుడు జలకళను సంతరించుకుంది....