అర్జున్ సమాచారం:
కొల్తూరు గ్రామంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. పారిశ్రామిక కంపెనీల వ్యర్ధాలతో కలుషితమైన నీటితో కుంటలు మరియు చెరువులు కాలుష్య కూపంగా మారి అందులో ఉన్న చేపలు మరియు నీటి తాగనీకి వచ్చే పశు సంపద ఇతర వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని తెలియడంతో చెరువు దగ్గరికి వెళ్ళి స్వయంగా పరిశీలించిస్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అధికారులతో మాట్లాడి పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లోకి రాకుండా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిశ్రమలు కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకొని కలుషిత నీళ్ళు బయటికి రాకుండా చూసుకోవలసిన బాధ్యత వారి మీద ఉందని లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ
జీడిమెట్ల కెమికల్ ఇండస్ట్రీ ఏరియా, జీనోమ్ వాలీ, తుర్కపల్లి, జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి వచ్చిన మురుగునీరు, వాసన వల్ల ఈ ప్రాంత ప్రజల జీవనం దుర్భరంగా మారింది.
– వీచే గాలి విషం అయ్యింది.
– చర్మం దద్దుర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, అబార్షన్లు, క్యాన్సర్, పశువులు ప్రెగ్నెంట్ అవ్వడం లేదు.
– ఒక్కమాటలో చెప్పాలంటే వీరు నరకంలో బ్రతుకుతున్నారు.
– ఇవి మురికి కూపాలు కావు, ప్రాణాలు తీస్తున్న నరక కూపాలుగా మారాయి.
– ఇంత టెక్నాలజీ వచ్చినా, నిబంధనలు వచ్చినా రసాయన వ్యర్థాలను అరికట్టలేక పోతున్నారు.
– ప్రతి పరిశ్రమలో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి కానీ కొద్దిమంది ఫార్మా కంపెనీల యాజమాన్యాలు బోర్లు వేసి ఆ రసాయన వ్యర్థాలను భూమిలోకి పంపిస్తున్నారు. డ్రైనేజీ లలో వదిలి పెడుతున్నారు.
– దీనివల్ల చెరువుల్లో ఉన్న చేపలు, వాటిని తిన్న కొంగలు, పక్షులు చనిపోతున్నాయి. నీళ్లు తాగి పశువులు చనిపోతున్నాయి.
– కొల్తూరు గ్రామంలో జీనోమ్ వ్యాలీ నుండి వచ్చిన రసాయన వ్యర్థాల వల్ల దాదాపు 15 లక్షల రూపాయల విలువైన చేపపిల్లలు చనిపోయాయి. ఈ చేపలు పెరిగితే కోటి రూపాయల సంపద. 250 కుటుంబాలు ఈ చేపల మీద ఆధారపడి ఉన్నాయి. కళ్ళముందే చనిపోతుంటే వీరు విలవిలలాడుతున్నారు.
– ఫార్మాకంపెనీల వల్ల మాకు ఉపాధి దొరుకుతుంది అనుకున్నాం, కానీ వీటివల్ల మా ప్రాణాలే పోతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
– కిడ్నీ డయాలసిస్, అబార్షన్ వల్ల ఈ ఊరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
– సంపాదన అంతా ఆసుపత్రులకే అవుతుంది.
– పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు పెద్ద కంపెనీ వారు ఇచ్చే డబ్బులకు మరిగి పేదలు చచ్చిపోతున్న పట్టించుకోవడం లేదు.
– ఈ ప్రాంత ఎంపీ గా అవసరం అయితే డిల్లీ వరకు కంప్లైంట్ చేస్తాం..
– దీనికి శాశ్వత పరిష్కారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాము.
=======================