ఎంపీ వద్దిరాజుతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంజీరా డ్యామ్‌ను ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి – అమృత్ ధరోహర్ పథకంలో చేర్చి రామ్‌సార్ గుర్తింపునకు సహకరించాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే ప్రభాకర్ విజ్ఞప్తి
అర్జున్ సమాచారం:సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను "అమృత్ ధరోహర్" పథకం కింద ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిందిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను కోరారు.ప్రభాకర్ ఢిల్లీలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి షెఖావత్ తో భేటీ అయ్యారు.మంజీరా డ్యామ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, దానికి సంబంధించిన వెట్‌ల్యాండ్‌కు అంతర్జాతీయ రామ్‌సార్ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.మంజీరా...