ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 8:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం:
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత  తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళనంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు,మంత్రి పొన్నం ప్రభాకర్,  పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
========================