ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇద్దరు పిల్లల నిబంధనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు తగ్గినట్లు గుర్తుచేసిన కోర్టు వృద్ధుల జనాభా పెరుగుదలపై కోర్టు ఆందోళన మూడో సంతానంతో అనర్హతకు గురైన మాజీ సర్పంచ్‌కు ఊరట
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదనే నిబంధన ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఇద్దరికి మించి పిల్లలున్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే చట్టాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాల్లో దేశ జనాభా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2.1 అనే ప్రత్యామ్నాయ...