ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజలకు సమాధానం చెప్పాలి
గోదావరిఖని,అర్జున్ సమాచారం: : ఏఐసీసీ పిలుపు మేరకు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ...