ఎన్‌హెచ్-44పై నిఘా మరింత పటిష్ఠం తూప్రాన్ టోల్‌గేట్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

మెదక్, తూప్రాన్, జులై 7,అర్జున్ సమాచారం: జాతీయ రహదారి-44పై భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ సూచించారు. మంగళవారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా నిర్వహణపై...