ఎమ్మెల్సీ టికెట్లపై తీన్మార్ మల్లన్న ఫైర్.. జానారెడ్డి కుట్ర అంటూ సంచలన ఆరోపణ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ రెండు స్థానాలు రెడ్లకే ఇచ్చారని తీన్మార్ మల్లన్న విమర్శ రాష్ట్రంలో బీసీ వాదం లేదని నిరూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపాటు

అర్జున్ సమాచారం: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా వేడి పుట్టించింది. రెండు సీట్లనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడంపై తెలంగాణ రాజ్య అధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, సీనియర్ నేత జానారెడ్డి నాటకమాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి సామ రామ్మోహన్‌ రెడ్డిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి రామిరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది. దీనిపై మల్లన్న మాట్లాడుతూ......