ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వం- మంత్రి సీతక్క

అర్జున్ సమాచారం : వర్షాలు ఆలస్యమైనా.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ముందస్తు కార్యాచరణతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా జలాశయాల నీటి నిల్వలపై రోజువారీ పర్యవేక్షణ.. అవసరమైతే ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగానికి ఆదేశాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం తెలంగాణ సచివాలయంలో జరిగింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలు, రాబోయే నెలల్లో తాగునీటి అవసరాలపై...