.ఎల్‌నినో ఎఫెక్ట్.. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ప్రభుత్వ ఉక్కుపాదం

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్న ముందస్తు అంచనాలతో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం అప్రమత్తమైంది. భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తూ, ప్రజల నీటి అవసరాలను వ్యాపారంగా మార్చుకుని లక్షల రూపాయలు ఆర్జిస్తున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. అక్రమ బోర్లు, అనుమతులు లేని నీటి వ్యాపారానికి చెక్ పెట్టేందుకు హెచ్‌ఎండబ్ల్యూఎస్, హైడ్రా, హెచ్‌ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి...