ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి వేసవి తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట,అర్జున్ సమాచారం: జిల్లాలో ఎల్నినో ప్రభావం కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గి, నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్ భగీరథ, భూగర్భ జల వనరులు, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ నెలలోనే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోందని తెలిపారు. గతంలో...