ఎల్లమ్మ’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’, జాతీయ అవార్డు గ్రహీత, ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథగా ‘ఎల్లమ్మ’ను తీర్చిదిద్దుతున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను 2027 మార్చి...