ఎల్ నినో ప్రభావం, NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, NEET-PG ప్రవేశ పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయసాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల...