ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’ ఎస్‌ఐఆర్ విచారణకు ముందు రాహుల్ గాంధీ శివుడి చిహ్నంతో పోస్ట్ ‘సత్యం శివం సుందరం’ అనే పదాలను జోడించిన కాంగ్రెస్ అగ్రనేత ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల అభ్యంతరాలు అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదముందని పిటిషనర్ల ఆరోపణ ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయ సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఎస్‌ఐఆర్ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం వాదన
అర్జున్ సమాచారం: ఓవైపు ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పోరు.. మరోవైపు సుప్రీంకోర్టులో కీలక విచారణ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘సత్యం శివం సుందరం’ అనే పదాలతో పాటు శివుడికి సంబంధించిన చిహ్నాన్ని ఆయన పంచుకున్నారు. ఎస్‌ఐఆర్‌పై పిటిషన్ల విచారణకు ముందు ఈ పోస్ట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్‌ఐఆర్‌పై వివాదం ఏంటి?: ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు కొనసాగించడం, అనర్హుల పేర్లను...