ఏఐ రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ బాధ్యతాయుతమైన సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్

"అర్జున్ సమాచారం: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక ప్రయోజనాలను జోడించి 'ఏఐ ప్రమాణాలకు దిక్సూచి'గా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి (HICC) వేదికగా జరిగిన 'గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ - ది హైదరాబాద్ కలెక్టివ్' కార్యక్రమాన్ని, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. 'ది మెరీడియన్...