ఏడుపాయలలో ఈనెల 11 నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట, అక్టోబర్ 7,అర్జున్ సమాచారం: రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాత సన్నిధిలో ఈనెల 11 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించను న్నట్లు ఆలయ చైర్మన్ వీరేశం తెలిపారు. ఈనెల 11న బాల త్రిపుర సుందరి దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవి, 14న మహా చండి, 15 మహాలక్ష్మి, 16 సరస్వతి దేవి, 17న లలిత త్రిపుర సుందరి దేవిగా, 18న దుర్గాదేవి, 19 న మహిషాసుర మర్దిని, 20 శ్రీ రాజరాజేశ్వరి...