ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

అమరావతి,జూలై 6,అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా  సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురషోత్తమ్ కుమార్ చింతలపూడిలచే  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనియామకాలతో ఏపీ హైకోర్టులో...