ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం అమరావతిలో రూ.174 కోట్ల పెట్టుబడితో ఒబెరాయ్ హోటల్ 150 ప్రత్యక్ష, 250 పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు త్వరలో వెల్లడికానున్న హోటల్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలు
అర్జున్ సమాచారం: ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆతిథ్య రంగాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రముఖ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ గ్రూప్ అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) అధికారికంగా కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ అధికారులు, ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు ఈ ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ద్వారా రాజధాని...