ఏపీ సొంత రాబడి పెరిగింది.. ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు కీలక సమీక్ష – రాష్ట్ర సొంత ఆదాయంలో 18.7 శాతం వృద్ధి నమోదు – ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలన్న సీఎం చంద్రబాబు – నవంబర్ 23 నాటికే 58 శాతం వార్షిక లక్ష్యం పూర్తి – వాణిజ్య, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల్లో పెరిగిన రాబడి – పన్నుల పరిశీలన, ఆడిట్లలో ఏఐ సాంకేతికత వినియోగం
అమరావతి: రాష్ట్రంలో ఆదాయార్జన శాఖల పనితీరు, రాబడి వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఇది రూ.11,738 కోట్లు అధికమని, మొత్తంగా 18.7 శాతం వృద్ధి నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ...