ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా? సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి.. లేనిపక్షంలో బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. -మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక
అర్జున్ సమాచారం : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరిస్తూ ఆయన ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. రైతుల వినతిపై...