ఐడీఎల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఆంజనేయనగర్ రహదారిలో అడ్డంకులపై ఆరా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను వివరించిన అధికారులు
హైదరాబాద్, సెప్టెంబరు 18: అర్జున్ సమాచారం: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం పరిశీలించారు. ఎత్తైన విగ్రహాలు నిమజ్జనం అయ్యేలా 25 అడుగులకు పైగా చెరువు లోతును పెంచారు. వేలాదిగా తరలివచ్చిన విగ్రహాలను ఐడీఎల్ చెరువులోకి చేరేలా ప్రధాన రహదారి వైపు ఏర్పాట్లు చేసిన భారీ క్రేన్లను కూడా హైడ్రా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. నిమజ్జనం జరుగుతుండగానే చెరువులో...