ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు పరిరక్షించాల్సిన జాతీయ ఆస్తులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ నిలిపేయాలన్న తమ విజ్ఞప్తికి ఆందోళనకు మద్దతు తెలపాలని ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. తనకు ట్యాగ్ చేసిన అంశంపై కేటీఆర్ స్పందించారు. ఐడీబీఐ బ్యాంకు విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న నివేదికలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్రానికి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. బిడ్‌లు...