ఐదు భాషల్లో ‘రామాయణ: పార్ట్ 1’ చిత్ర ట్రైలర్ విడుదల

నితీశ్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా  ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది అకాడమీ అవార్డులు (ఆస్కార్®️) గెలుచుకున్న విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్‌ఈజీ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా దీపావళి 2026 సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నమిత్ మల్హోత్రా రామాయణ: పార్ట్ 1' అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. జూలై...