ఒక కెమెరా 100 కళ్ళతో సమానం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
అదిలాబాద్,అర్జున్ సమాచారం: ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన 21 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్...