‘ఓం’ మూవీ నుంచి రిలీజైన సెకండ్ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్
వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం – చాప్టర్ 1: ఉదిరం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘వీళా వీర’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. హీరో పవర్, పరాక్రమం, గంభీరమైన వ్యక్తిత్వం, వీరోచిత విన్యాసాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్సాహభరితమైన ప్రదర్శన, హీరో పాత్రను శక్తిమంతంగా చూపించిన తీరు...