ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓటు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్.

జయశంకర్ భూపాలపల్లి. అర్జున్ సమాచారం:
స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బిఎల్ఓ సదయ్య, సూపర్ వైజర్ జితేందర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్‌ రాహుల్ శర్మకు ఎన్యూమరేషన్ ఫారాలు అందచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పోలింగ్ కేంద్రం 79 లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ  మాట్లాడుతూ  జిల్లాలో ఓటర్ల  ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించి ఓటర్ల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను  ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర  ఎన్నికల సంగం   ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నూతన ఓటర్ల నమోదు, మరణించిన ఓటరు పేర్లు తొలగింపు, చిరునామా మార్పులు వంటి వివరాలను పకడ్బందీగా సేకరిస్తున్నారని ప్రజలు సహకరించాలని సూచించారు.
ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.