ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం – ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఈరోజు గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించారనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఓటు...