ఓట్, సీట్ చోరీ పేటెంట్స్ కాంగ్రెస్ వే: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,అర్జున్ సమాచారం: ఓట్ చోరీ, సీట్ చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని చెప్పారు. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పాలకులు కాంగ్రెస్ కోరిన సమయంలో దేశంలోని ప్రదేశ కాంగ్రెస్ కమిటీలన్నీ తొలి ప్రధాని అభ్యర్ధిగా  పటేల్ పేరు ప్రతిపాదిస్తూ ఓట్లేస్తే ఒక్క పీసీసీ మద్దతు కూడా నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని...