కన్నయ్య, జాఖడ్‌లకు రాహుల్ ప్రశ్నలు ఎన్నికల వ్యూహంపై వివరణ కోరిన నాయకత్వం దీపాంశు షోకీన్ అంశంపైనా చర్చ మూడు పదవులు దక్కించుకున్న ఏబీవీపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉపాధ్యక్షుడైన షోకీన్
ఢిల్లీ :అర్జున్ సమాచారం: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ ఎదుర్కొన్న పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఎన్నికల్లో గెలుపు అంచనాలతో బరిలోకి దిగిన ఎన్‌ఎస్‌యూఐ ఒక్క కేంద్ర పదవినీ దక్కించుకోకపోవడంతో పార్టీ నాయకత్వం దీనిపై సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌ఛార్జ్ కన్నయ్య కుమార్, జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖడ్‌లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో కన్నయ్య కుమార్,...