కమ్యూనిస్ట్ పార్టీలతో జగన్ ములాఖత్
నెల్లూరు, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయ వ్యూహంలో వస్తున్న మార్పులను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఓడిపోయాక కూడా జగన్ రెడ్డి విధానాలను, శైలిని అత్యంత తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, అనూహ్యంగా నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తమ పార్టీ నిర్వహించే సదస్సుకు హాజరు కావాలంటూ జగన్‌ను ఆయన ఆహ్వానించడం కేవలం ఒక...