కరీంనగర్ కీర్తిని అంతర్జాతీయ వేదికపై చాటనున్న అక్షిత జాతీయ స్థాయిలో స్వర్ణం. ఏషియన్ పోటీలకు భారత జట్టులో స్థానం కరీంనగర్,

కరీంనగర్,అర్జున్ సమాచారం: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, చింతకుంట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆకుల అక్షిత భారతదేశం తరఫున ఏషియన్ త్రోబాల్ పోటీలకు ఎంపికై అరుదైన ఘనత సాధించింది. గత నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న ఆకుల అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. జాతీయ స్థాయిలో ఆమె చూపిన అత్యుత్తమ ప్రదర్శనను గుర్తించిన ఎంపిక...