కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష కరీంనగర్

కరీంనగర్,అర్జున్ సమాచారం: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి  పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ను పరిశీలించారు....