కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్,అర్జున్ సమాచారం: తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3వ జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 జూలై మంగళవారం, నేడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించబడుతున్నాయని సీపీ తెలిపారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.ఈ డ్యూటీ మీట్‌లో జోన్-3 పరిధిలోని కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మొత్తం 91 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. యూనిట్ వారీగా కరీంనగర్ నుంచి 24 మంది, సిద్ధిపేట నుంచి 19 మంది, రాజన్న సిరిసిల్ల నుంచి 21 మంది, కామారెడ్డి...