కలెక్టరేట్ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలి ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారంతోనే సీఎం రేవంత్ రెడ్డి

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలి. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలి. సంక్షేమపథకాలు పేదలకు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులే. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశాం. సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడండి. అప్పుడే సహాయం కోసం వచ్చే వారికి నూటికి నూరు...