కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా ట్రైలర్ లాంచ్
ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని క్రేజీ గ్యాంగ్ మళ్లీ కలుసుకోబోతున్న సమయం ఆసన్నమైయింది. ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్గా రూపొందుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ నవంబర్ 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్...