కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కొనసాగింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ సమాచారం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. ఈ పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ ధర్మాసనం విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా.. ఈరోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కాగా, ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును...