కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి 4 సూటి ప్రశ్నలు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం – కాంగ్రెస్ పార్టీని నాలుగు ప్రశ్నలు అడిగిన కేంద్ర మంత్రి రిజిజు – 1962 చైనా యుద్ధ అవమానానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ – భారత్‌ను ఎందుకు పేద దేశంగా ఉంచారో చెప్పాలన్న మంత్రి – దేశ ఆర్థిక వ్యవస్థను అవమానించారంటూ కాంగ్రెస్‌కు ప్రశ్నలు – ఏపెక్ త్రైపాక్షిక భేటీపై ప్రధాని మోదీని విమర్శించిన రాహుల్
అర్జున్ సమాచారం : కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 1962 నాటి యుద్ధ అవమానానికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా? అని ప్రశ్నిస్తూ శనివారం ఆయన నాలుగు సూటి ప్రశ్నలను సంధించారు. చైనాలో జరిగిన ఏపెక్ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రిజిజు మండిపడ్డారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా...