కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు
అర్జున్ సమాచారం: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు పొంతన లేదని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్...