‘‘కాంగ్రెస్‌ ఎంపీల సంఖ్య పెరగాలంటే ఇలా చేయాలి’’.. రాహుల్‌కు కేంద్రమంత్రి 7 సలహాలు విదేశీ పర్యటనలు తగ్గించి భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని హితవు సీనియర్లను గౌరవించాలని, భారత్‌ వ్యతిరేక వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచన పార్లమెంటు చర్చల్లో కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొనాలని సూచన రాజ్యాంగ సంస్థలను గౌరవించి కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలన్న మంత్రి మోదీతో బహిరంగ చర్చకు రాహుల్‌ సవాల్‌ విసరడంతో ముదిరిన మాటల యుద్ధం

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సవాల్‌ విసురుతుంటే.. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్‌కు పార్లమెంటులో మరిన్ని స్థానాలు కావాలంటే రాహుల్‌గాంధీ ఏడు విషయాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. తరచూ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని, సీనియర్లను గౌరవించాలని హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రాహుల్‌గాంధీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లకుండా భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని రిజిజు సూచించారు....