ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుమార్ గౌడ్

కమాన్ పూర్ (పాలకుర్తి),అర్జున్ సమాచారం:
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధమ ధ్యేయమని పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామ దికి చెందిన బాలగోని కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబుల సూచన మేరకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఠాగూర్ కుమార్ గౌడ్ కు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శీను బాబు మరియు ఎం ఎస్ రాజు ఠాగూర్ జిల్లా కార్యదర్శి పదవి అప్పగించడం జరిగిందని. వారి ఆశలను వమ్ము చేయకుండా పార్టీ బలోవేత్తమే ప్రధమ ధ్యేయంగా పనిచేస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని అన్నారు. అలాగే తన నియామకానికి పరోక్షంగా కృషి చేసిన పాలకుర్తి మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గౌడ్ కు డిసిసి ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య లకు ధన్యవాదాలు తెలిపారు..