కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: సామాజిక న్యాయం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, మంత్రివర్గంలో బీసీలు, మహిళలు, ఎస్సీ/ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని దుయ్యబట్టారు. 56 శాతం ఉన్న బీసీలకు కేవలం ముగ్గురికే, మహిళలకు ఇద్దరికే మంత్రి పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 6న 'సామాజిక న్యాయ సంకల్ప సభ' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేము సామాజిక న్యాయ తెలంగాణ...