కాంగ్రెస్ బిఆరెస్ కుమ్మక్కయ్యారు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు మీ రాజకీయ డ్రామాలు ఆపండి ఎంపి ఈటల
హైదరాబాద్,అర్జున్ సమాచారం: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యారని ఎంపి ఈటల రాజేందర్ ఆరోపించారు. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్యుంచుకుంటున్నారు. పంటలు ఎండడం చూస్తుంటే పల్లె పల్లెల పల్లెర్లు మొలిచాయి అనే పాట గుర్తుకు వస్తుంది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, పోయేకాలం వచ్చింది. గోదావరిలో నీళ్లు పారుతున్నప్పుడు ఎత్తి పోయకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇదని అన్నారు. ఒకపక్క నీళ్లు లేక మరోపక్క కరెంటు కోతలతో పంటలు ఎండుతుంటే.. రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వహించినట్లు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. ...