కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’ పై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఫైర్.
హైద్రాబాద్ జులై 16,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 'ఎడ్యుకేషన్ జిహాద్' తారాస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థిని చేత కల్మా చదివించి, హోం వర్క్‌గా కల్మా మరియు 'సూరాఅల్-ఫాతిహా'లను నేర్చుకుని, పుస్తకాల్లో రాసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించడం అత్యంత...