కాగ్నా వంతెనపై మళ్లీ రంధ్రం.. నాణ్యతపై అనుమానాలు! వికారాబాద్

వికారాబాద్,అర్జున్ సమాచారం: తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నా నదిపై నిర్మించిన వంతెనపై మరోసారి రంధ్రం ఏర్పడటం కలకలం రేపింది. గతేడాది జూలైలో ఇదే వంతెనపై రంధ్రం ఏర్పడగా.. తాజాగా శుక్రవారం మరోసారి రంధ్రం పడింది. సుమారు ఐదేళ్లుగా ఈ వంతెనపై రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో రెండుసార్లు రంధ్రాలు ఏర్పడటంపై వాహనదారులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూలై చివర్లో కాగ్నా వంతెన రహదారిపై రంధ్రం ఏర్పడింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు పూర్తయి ఏడాది కూడా...