కాజీపేటలో భారీగా గంజాయి పట్టివేత: ఇద్దరు నిందితుల అరెస్ట్ ఆటో సీజ్

హనుమకొండ , అర్జున్ సమాచారం : హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల నుంచి సుమారు రూ.70,000 విలువైన గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలు: కాజీపేట ఉమెన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్. మౌనిక  కాజీపేట ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కడిపికొండ బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్లాస్టిక్ కవర్‌తో కనిపించారు. పోలీసులను చూడగానే వారు పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన...