కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ
అర్జున్ సమాచారం: కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పించబడ్డాయి. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీన ముగియనున్నాయి. ఈ మేరకు శ్రీశైలదేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు జి. లక్ష్మేశ్వరి, జిల్లెల శ్రీదేవి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, వాయిగండ్ల వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాసులు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు, తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ...