కార్తికేయ హీరో,దర్శకుడిగా ‘కమ్‌బ్యాక్’ కొత్త సినిమా
ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. 'ఆర్ఎక్స్ 100'లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. హీరోగా మాత్రమే కాదు... నటుడిగానూ ప్రేక్షకుల మదిలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనలో స్టైలిష్ విలన్ ఉన్నాడని 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో చూపించారు. కోలీవుడ్ స్టార్ అజిత్ 'వలిమై'లో తనదైన విలనిజంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. కథానాయకుడిగా రెండేళ్ళ విరామం తర్వాత కార్తికేయ...