కార్తీక దీపం వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, నవంబరు 20,అర్జున్ సమాచారం: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. నవంబరు 24న పౌర్ణమి రోజు కొండపై కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతినిచ్చింది. అయితే, రాత్రి స్తంభం వద్ద దీపం వెలిగించే ఆచారాన్ని పునరుద్ధరించాలన్న ఆదేశాలను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని భాగాలపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. కొండ పైభాగం యాజమాన్య హక్కులు, ఈ ఆచారం నిర్వహించే ప్రదేశంపై హిందూ...